చరిత్ర సృష్టించిన టీడీపీ... కోటి దాటిన సభ్యత్వాల సంఖ్య

16-01-2025 Thu 18:58 | Both States
Advertisement
  • 1,00,52,598 సభ్యత్వాలు నమోదుచేసిన టీడీపీ
  • 11 నియోజకవర్గాల్లో లక్ష సభ్యత్వాలు దాటిన వైనం
  • 105 నియోజకవర్గాల్లో 50 వేలకు పైగా సభ్యత్వాలు
Advertisement
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది అక్టోబర్ 26న టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాజాగా సభ్యత్వాలు తీసుకున్న వారి సంఖ్య ఒక కోటి మార్క్ ను దాటి చరిత్రను తిరగరాసింది. ఇప్పటివరకు 1,00,52,598 మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. 

11 నియోజకవర్గాలు లక్ష సభ్యత్వాల మార్కును దాటాయి. 105 నియోజకవర్గాలు 50 వేల సభ్యత్వాల మార్కును దాటాయి. ఈ క్రమంలో, కోటి మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ అతి పెద్ద కుటుంబంగా అవతరించింది. టెక్నాలజీ అనుసంధానంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం సులభమైంది. 

ప్రజలు స్వయంగా సభ్యత్వ నమోదు చేసుకునే సౌలభ్యం కల్పిస్తూ, వారు ఎక్కువగా వినియోగించే ప్లాట్ ఫామ్స్ తో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీసుకున్న నిర్ణయం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం. 

టెక్నాలజీ వినియోగం ద్వారా... పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో పార్టీ అధిష్ఠానానికి స్పష్టంగా తెలుస్తుంది. తద్వారా పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఇచ్చేప్పుడు ప్రాధాన్యత లభిస్తుంది. పనిచేసే వారికే ప్రాధాన్యత అని లోకేశ్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాయకులు సభ్యత్వ నమోదు కోసం తీవ్రంగా కృషి చేశారు. 

పార్టీ సభ్యత్వ నమోదులో తాము చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుందని కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేశ్ ఎక్కువ సభ్యత్వాలు చేసిన కార్యకర్తలతో మాట్లాడి అభినందించడం, ప్రోత్సహించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

సభ్యత్వాల నమోదులో టాప్ టెన్ నియోజకవర్గాలు ఇవే...

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పోటీపడి మరీ రికార్డులు సృష్టించారు. 11 నియోజకవర్గాలు లక్ష సభ్యత్వాల మార్కు దాటాయి. టాప్ టెన్ లో నెల్లూరు సిటీ 1,49,270, ఆత్మకూరు 1,48,802, పాలకొల్లు 1,48,559, రాజంపేట 1,45,766, కుప్పం 1,38,446, ఉండి 1,21,527, గురజాల 1,11,458, వినుకొండ 1,06,867, మంగళగిరి 1,06,145, కళ్యాణదుర్గం 1,01,221, కొవూరు 1,00,473 సభ్యత్వాలతో ఉన్నాయి. 

 లైఫ్ టైమ్ మెంబర్షిప్ 

శాశ్వత సభ్యత్వాలకు కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది. మంగళగిరి - 145, ఆత్మకూరు - 137, వినుకొండ - 79,  గంగాధర నెల్లూరు - 62, తణుకు - 60 నియోజకవర్గాలు టాప్ ఫైవ్ లో నిలిచాయి.

కార్యకర్తల సంక్షేమం 

కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి... నారా లోకేశ్ ఆధ్వర్యంలో  దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కార్యకర్తలు.. వారి కుటుంబసభ్యుల విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబానికి ప్రమాదబీమా అందించి ధీమా కల్పిస్తున్నారు. 

టీడీపీ కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేశ్ కు అప్పగిస్తున్నామని 2014 మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. నాటి నుంచి నేటివరకూ 2500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం చేశారు.  వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రూపాయలు చొప్పున రూ. 103 కోట్ల 28 లక్షల రూపాయలు అందించారు.  

అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సహాయం అందించారు. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి రూ. 19 కోట్లు ఆర్థిక సహాయం చేశారు. 

రూ.100తో సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ వెల్ఫేర్ వింగ్ అవిశ్రాంతంగా పని చేస్తోంది. ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకారవేతనాలు, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలుగా రూ. 2 కోట్ల 35 లక్షల రూపాయలు చెల్లించారు. చదువు పూర్తయిన వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు సాధించేలా నైపుణ్యశిక్షణ ఇస్తున్నారు. 

రూ.100తో తీసుకున్న సభ్యత్వం ద్వారా వచ్చే ప్రమాద బీమా ప్రయోజనాన్ని రూ. 5 లక్షలకు పెంచారు. నారా లోకేశ్ సమక్షంలో కోటి మందికి ప్రమాద బీమా కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ మధ్య ఒప్పందం చేసుకున్నారు.
Advertisement
TDPMembershipsChandrababuNara LokeshAndhra PradeshTelanganaAndaman

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more