ఏపీ వ్యాప్తంగా కోడి పందేల హోరు.. చేతులు మారిన వేల కోట్ల రూపాయలు!

16-01-2025 Thu 07:07 | Andhra
Advertisement
  • కోనసీమ నుంచి రాయలసీమ వరకు జోరుగా కోడి పందేలు, గుండాట, పేకాట
  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క పందెం రూ. 1.25 కోట్లు
  • జాతరను తలపించిన కోడి పందేల శిబిరాలు
  • గుండాటలో గెలిచిన డబ్బులు ఇవ్వకపోవడంతో యువకుడి ఆత్మహత్యాయత్నం
  • ఎన్టీఆర్ జిల్లాలో ఆకర్షించిన పొట్టేళ్ల పందేలు
Advertisement
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు జరిగిన కోడి పందేల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోనసీమ నుంచి రాయలసీమ వరకు రాష్ట్రం కోడిపందేలతో హోరెత్తింది. ఎక్కడ చూసినా పందేలు జాతరను తలపించాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క పందెమే రికార్డు స్థాయిలో రూ. 1.25 కోట్లు పలికింది. ఏలూరులో అయితే ఓ వ్యక్తి రూ. 2 కోట్ల పందేనికి సైతం సై అన్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో 1500కుపైగా బరుల్లో పందేలు జరిగాయి. కోడి పందేలకు తోడు గుండాట కూడా జోరుగా సాగింది. కాకినాడ జిల్లాల్లో గుండాట జోరుగా సాగింది. ప్రత్తిపాడు మండలంలోని ఓ గ్రామంలో మూడు రోజులకు కలిపి ఓ నిర్వాహకుడు ఏకంగా రూ. 1.2 కోట్ల వ్యాపారం నిర్వహించాడు.

భోగి రోజు ఓ మాదిరిగా జరిగిన కోడి పందేలు సంక్రాంతి, కనుమ రోజు మాత్రం ఊపందుకున్నాయి. బరుల వద్ద ఇసుకేస్తే రాలనంతమంది కనిపించారు. బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఓ పేకాట శిబిరం వద్ద జూదరులను ఆకర్షించేందుకు నిర్వాహకులు కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. శిబిరంలో కొత్తబట్టలు, నాటుకోడి పులుసుతో రాగిసంకటి, గారెలు సిద్ధం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్కో పందెం రూ. 7 లక్షల వరకు చేరుకుంది. కొన్ని బరుల్లో మహిళా యాంకర్లు సందడి చేశారు. 

పందేలపై  పోలీసులు అక్కడక్కడ దాడులు చేయగా, చాలాచోట్ల వారు కనిపించలేదు. దీంతో పందేలు జోరుగా సాగాయి. తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లిలో గుండాటలో రూ. 200 గెలుచుకున్నప్పటికీ ఇవ్వకపోవడంతో కొమ్మిశెట్టి గంగాధర్ (18) అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాకినాడ జిల్లాలో కోడి పందేల్లో గెలిచిన వారు మహీంద్ర థార్ వాహనాన్ని సొంతం చేసుకున్నారు. చాలా బరుల్లో విజేతలు బైక్‌లను సొంతం చేసుకున్నారు. 

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో జరిగిన పొట్టేళ్ల పందేలు ఆకట్టుకున్నాయి. తిరుపతి జిల్లాలోని ఎ.రంగంపేటలో నిన్న నిర్వహించిన జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. దీనిని తిలకించేందుకు వచ్చిన వారిని ఎద్దులు కుమ్మేయడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నర్సాపురంలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి సందడి చేసింది.  
Advertisement
Cock FightKodi PandeluAndhra PradeshSankranti

More Telugu News

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29
..more