కూల్‌డ్రింక్స్‌తో ఏడాదికి 22 లక్షల టైప్ 2 డయాబెటిస్ కేసులు!
- అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
- మధుమేహానికి అదనంగా గుండె జబ్బులు కూడా
- 2020లో నమోదైన టైప్ 2 డయాబెటిస్ కేసుల్లో 9.8 శాతం కూల్‌డ్రింక్స్ వల్లే!
శీతల పానీయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 22 లక్షల మంది టైప్ 2 డయాబెటిస్ బారినపడుతున్నారట. అంతేకాదు, 12 లక్షల మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన టైప్ 2 డయాబెటిస్ కేసుల్లో 9.8 శాతం మంది తీపి పానీయాలు తీసుకోవడం వల్లే దీని బారినపడినట్టు వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.