ఆస్ట్రేలియన్ ఓపెన్: జకోవిచ్ పై పోరాడి ఓడిన మన 'నెల్లూరు' బసవారెడ్డి

13-01-2025 Mon 18:06 | Sports
Advertisement
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ లో నేడు జకోవిచ్ × నిశేష్ బసవారెడ్డి
  • 6-4, 3-6, 4-6, 2-6తో ఓటమిపాలైన తెలుగు సంతతి కుర్రాడు
  • తొలి సెట్ గెలిచినప్పటికీ, రెండో సెట్లో గాయం
  • వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్ కైవసం చేసుకున్న జకోవిచ్ 
  • నిశేష్ తనను ఆశ్చర్యపరిచాడన్న మాజీ వరల్డ్ నెంబర్ వన్ 
Advertisement
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఈసారి తెలుగు మూలాలున్న అమెరికన్ టీనేజి కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి పేరు నిశేష్ బసవారెడ్డి. నిశేష్ కుటుంబం ఏపీలోని నెల్లూరు నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. దిగ్గజ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ ను ఆదర్శంగా తీసుకుని టెన్నిస్ బాట పట్టిన నిశేష్ బసవారెడ్డి ఇవాళ తన ఆరాధ్య హీరోతో తలపడడం విశేషం. 

ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో నేడు జకోవిచ్, బసవారెడ్డి మధ్య తొలి రౌండ్ మ్యాచ్ జరిగింది. పెద్దగా గ్రాండ్ స్లామ్ అనుభవం లేనప్పటికీ, తెలుగు సంతతి కుర్రాడు బసవారెడ్డి మాజీ వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్ కు గట్టిపోటీ ఇచ్చాడు. తొలి సెట్ ను 6-4తో చేజిక్కించుకున్న బసవారెడ్డి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. 

జకోవిచ్ వంటి ఆటగాడి సర్వీసును బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే, 19 ఏళ్ల బసవారెడ్డి తొలి సెట్ లో నమ్మశక్యం కాని ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ రెండో సెట్ లో గాయపడడం అతడి ఆటపై ప్రభావం చూపింది. చివరికి జకోవిచ్ దే పైచేయి అయింది. తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ...  తన అనుభవాన్ని ఉపయోగించిన జకో వరుసగా మూడు సెట్లలో నెగ్గి మ్యాచ్ ను కైవసం చేసుకున్నాడు. తద్వారా రెండో రౌండ్ లో అడుగుపెట్టాడు. 

దాదాపు 3 గంటల పాటు సాగిన నేటి మ్యాచ్ లో బసవారెడ్డి 6-4, 3-6, 4-6, 2-6తో ఓటమిపాలయ్యాడు. 

మ్యాచ్ పూర్తయ్యాక జకోవిచ్ తన ప్రత్యర్థి నిశేష్ బసవారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్ చివరి వరకు అతడు కనబర్చిన పోరాట పటిమ తనను ఆకట్టుకుందని అన్నాడు. కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న అతడు తనను ఆశ్చర్యానికి గురిచేశాడని వెల్లడించాడు. కెరీర్ లో అతడు అత్యుత్తమంగా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
Advertisement
Nishesh BasavareddyNovak DjokovicAustralian OpenIndian OriginAndhra PradeshUSA

More Telugu News

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28
..more