భోగి వేడుకల్లో కేటీఆర్, హరీశ్ రావు, కవిత.. ఫొటోలు ఇవిగో!
- ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో భోగి వేడుకలు
- హాజరైన కేటీఆర్, హరీశ్, కౌశిక్ రెడ్డి తదితరులు
- కేబీఆర్ పార్క్ వద్ద వేడుకల్లో పాల్గొన్న కవిత
మరోవైపు కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ సంస్కృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... హైదరాబాద్ నడిబొడ్డున పల్లె వాతావరణాన్ని సృష్టించి భోగి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. భోగి అంటేనే ప్రతికూలతలను విడిచిపెట్టి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లడమని అన్నారు.




