హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్లు... తొలి ప్రాధాన్యం ఎవరికో చెప్పిన మంత్రి పొన్నం
- ప్రతి నిరుపేదకూ ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి
- స్థలం ఉన్నవారిని తొలుత ఎంపిక చేస్తామని వివరణ
- కొత్త రేషన్ కార్డుల జారీకి క్షేత్ర స్థాయిలో పరిశీలన
ఇందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై చర్చించినట్లు సమాచారం. సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి 20 వరకు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన జరుగుతుందని చెప్పారు. ఈ నెల 21 నుంచి అర్హులైన వారి వివరాలను డేటా ఎంట్రీ చేసి, 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వివరించారు. జిల్లాల నుంచి హైదరాబాద్ కు వలస వచ్చిన వారికి కూడా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.