Encounter: మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఛత్తీస్‌గడ్‌లో మరో ఎన్‌కౌంటర్

Encounter broke out between security personnel and Naxalites in the Sukma district of Chhattisgarh
షార్ట్స్‌లో చూడండి
ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య గురువారం మరో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మూడు దళాల భద్రతా సిబ్బందితో కూడిన ఒక జాయింట్ టీమ్ యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపడుతోందని, ఈ క్రమంలో గురువారం ఉదయం కాల్పులు మొదలయ్యాయని తెలిపారు. డీఆర్ఎస్ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా సిబ్బంది ఉమ్మడిగా ఈ ఆపరేషన్ చేపట్టారని వివరించారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, తదుపరి సమాచారం అందాల్సి ఉందని అధికారి పేర్కొన్నారు.

కాగా, నవంబర్ నెల నుంచి ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. నక్సల్స్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే, ఈ ఎన్‌కౌంటర్లకు ప్రతీకారంగా మావోయిస్టులు ఇటీవల భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2026 నాటికి నక్సల్స్ రహిత్ దేశాన్ని ఆవిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతినబూనింది. ఈ క్రమంలో యాంటీ నక్సలైట్ ఆపరేషన్లు విస్తృతంగా జరుగుతున్నాయి.
Go Back to Shorts
Encounter
Chhattisgarh
Naxalites

More Telugu News