లండన్ కు వెళ్లేందుకు జగన్ కు సీబీఐ కోర్టు అనుమతి
- లండన్ లో చదువుకుంటున్న జగన్ కుమార్తెలు
- కుమార్తె గ్రాడ్యుయేషన్ డేకు హాజరవుతున్న జగన్
- ఈ నెల 11 నుంచి 30 వరకు లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
మరోవైపు, నిన్న హైకోర్టులో జగన్ కు ఊరట లభించింది. జగన్ పాస్ పోర్ట్ పొందేందుకు హైకోర్టు ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) జారీ చేసింది. ఐదేళ్ల కాలపరిమితితో జగన్ కు పాస్ పోర్ట్ ఇవ్వాలని సంబంధిత అథారిటీని ఆదేశించింది. ఎన్వోసీ కోసం జగన్ వేసిన పిటిషన్ ను కొట్టేస్తూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.