క్రియేటివ్ పోలీసింగ్.. తాగి బండి నడుపుతున్న తండ్రికి కొడుకుతో కౌన్సెలింగ్.. వీడియో ఇదిగో!
- ఇక జన్మలో మద్యం సేవించి డ్రైవింగ్ చేయనంటూ కన్నీళ్లతో కొడుకుకు ప్రామిస్ చేసిన తండ్రి
- తెలంగాణలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. బండి మీద భార్యాపిల్లలతో వెళుతున్న అతడిని ఆపి టెస్ట్ చేయగా.. మద్యం సేవించినట్టు తేలింది. మద్యం సేవించి బండి నడపడం ప్రాణాంతకమని తెలిసి కూడా తన ప్రాణాలను రిస్క్ చేయడమే కాకుండా భార్యాపిల్లల ప్రాణాలనూ రిస్క్ లో పెడుతున్నారంటూ ఆ వ్యక్తికి ఎస్ హెచ్ ఓ లక్ష్మీ మాధవి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇదంతా తాను చెప్పకుండా ఆయన కొడుకుతోనే చెప్పించారు. దీంతో ఆ తండ్రి భావోద్వేగానికి గురై ఏడ్చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎస్ హెచ్ ఓ లక్ష్మీ మాధవికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.