సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
- జర్నలిస్టుపై దాడి చేసిన కేసు
- మోహన్ బాబుకు బెయిల్ నిరాకరించిన తెలంగాణ హైకోర్టు
- హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మోహన్ బాబు
ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు... మంచు మనోజ్ మరోవైపు... కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్లిన సమయంలో... ఒక జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలతో పాటు పలువురు తీవ్రంగా ఖండించారు. దాడికి సంబంధించి మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా... ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. దీంతో, తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.