Game Changer in IMAX: ఐమ్యాక్స్ లో 'గేమ్ చేంజర్' రిలీజ్... ఎగ్జయింటింగ్ గా ఉందన్న రామ్ చరణ్

Ram Charan said he is exiting for Game Changer release in IMAX
  • రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా గేమ్ చేంజర్
  • శంకర్ దర్శకత్వంలో చిత్రం
  • జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
గ్లోబల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మాస్ట‌ర్ మూవీ మేక‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌ను జ‌న‌వ‌రి 10 నుంచి ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ అల‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే. 

అభిమానులు, ప్రేక్ష‌కులు రామ్ చ‌ర‌ణ్‌ను ఎప్పుడెప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి లార్జ‌ర్‌దేన్ లైఫ్ వంటి ఈ సినిమాను లార్జ‌ర్ స్క్రీన్‌లో చూస్తే క‌లిగే అనుభూతే మ‌రో రేంజ్‌లో ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. అందులో భాగంగా ప్రేక్ష‌కుల‌ను ఓ స‌రికొత్త అనుభ‌వాన్ని అందించ‌టానికి ఐమ్యాక్స్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. దీనిపై రామ్ చరణ్ స్పందించారు. 

‘‘గేమ్ చేంజ‌ర్‌’ మూవీ నా హృద‌యానికెంతో ద‌గ్గ‌రైన చిత్రం. శంక‌ర్‌గారితో క‌లిసి ఈ సినిమా కోసం ప‌ని చేయ‌టం మ‌ర‌చిపోలేని అనుభూతినిచ్చింది. ఈ సినిమాను ఇప్పుడు ప్రేక్ష‌కులు ఐమ్యాక్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తార‌ని తెలియ‌టంతో నాకు చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తోంది’’ అన్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ భారీ యాక్ష‌న్ డ్రామా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌కు ఓ మ‌ర‌చిపోలేని అనుభూతినిస్తుంద‌న‌టంలో సందేహం లేదు. 

రామ్ చ‌ర‌ణ్ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేశారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో అంజ‌లి కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఎస్‌.జె.సూర్య‌, ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో అల‌రించ‌నున్నారు.

More Telugu News

Game Changer in IMAX
Ram Charan
Shankar
Kiara Advani
Dil Raju
Sri Venkateswara Creations