Australia vs India: 87 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. చ‌రిత్ర సృష్టించిన‌ భార‌త్‌, ఆసీస్ బాక్సింగ్ డే మ్యాచ్‌!

MCG breaks staggering 87 year feat with all time attendance record for India vs Australia 4th Test
షార్ట్స్‌లో చూడండి
మెల్‌బోర్న్‌లో భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ చ‌రిత్ర‌ సృష్టించింది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మందికి పైగా ప్రేక్ష‌కులు హాజ‌ర‌య్యారు. ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న ఓ టెస్టు మ్యాచ్‌కు ఇంత‌మంది రావడం ఇదే తొలిసారి. దీంతో 87 ఏళ్ల రికార్డు బ్రేక్ అయింది. 

1936/37లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌కు హాజ‌రైన ప్రేక్ష‌కుల సంఖ్య‌ను నాలుగో టెస్టు దాటేసింది. 1937 జనవరిలో వేదికపై జరిగిన యాషెస్ టెస్టును వీక్షించేందుకు ఆరు రోజుల పాటు 3,50,534 మంది అభిమానులు రావడంతో ఈ రికార్డు గతంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఆ రికార్డును అధిగ‌మించింది. ఈ మ్యాచ్‌కు మొదటి మూడు రోజులు స్టేడియం నిండిపోయింది. నాలుగవ రోజు కేవలం 40,000 మంది మాత్రమే హాజరైనప్పటికీ, ఇవాళ మొదటి సెషన్‌లోనే 50వేల‌ మందికి పైగా అభిమానులు హాజర‌య్యారు.

అయితే, మొత్తంగా ఈ మ్యాచ్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్ష‌కులు హాజరైన రెండవ మ్యాచ్‌గా నిలిచింది. 1999లో ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రిగిన‌ చారిత్రాత్మకమైన భార‌త్‌, పాకిస్థాన్ మ్యాచ్ ఈ జాబితాలో టాప్‌లో ఉంది. ఈ మ్యాచ్ కు ఐదు రోజులలో నమ్మశక్యం కాని విధంగా ఏకంగా 4,65,000 అటెండెన్స్ న‌మోదైంది.
Go Back to Shorts
Australia vs India
MCG
Melbourne
Cricket
Sports News

More Telugu News