గవాస్కర్ కు పాదాభివందనం చేసిన నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు
- మెల్బోర్న్ టెస్టులో నితీశ్ వీరోచిత శతకం
- కుటుంబ సభ్యుల్లో మిన్నంటిన ఆనందోత్సాహాలు
- గవాస్కర్ ను కలిసి తమ ఆనందాన్ని పంచుకున్న వైనం
ఈ సందర్భంగా నితీశ్ తండ్రి, తల్లి, సోదరి... గవాస్కర్ కు పాదాభివందనం చేశారు. అనంతరం నితీశ్ తండ్రిని గవాస్కర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నితీశ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువచ్చినందుకు భుజం తట్టి అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.