నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను: నారా లోకేశ్

  • అచ్చం చంద్రబాబులా ఉన్న మిమిక్రీ ఆర్టిస్ట్
  • ఒక పెళ్లి వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఏపీ ముఖ్యమంత్రిని ఇమిటేట్ చేసిన ఒక వ్యక్తి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ఏపీ మంత్రి నారా లోకేశ్ వరకు చేరింది. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేసిన లోకేశ్... తాను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యానని చెప్పారు. చంద్రబాబు మాదిరి కనిపించడానికి, మాట్లాడేందుకు ఎంత కష్టపడ్డాడో చూడండని అన్నారు. 

ఇటీవల ఒక పెళ్లి వేడుకకు ఒక మిమిక్రీ ఆర్టిస్టు అచ్చం చంద్రబాబు వేషధారణలో వచ్చారు. వేదికపైకి వచ్చి అందరికీ విక్టరీ సింబల్ చూపించారు. చంద్రబాబు మాదిరే మాట్లాడుతూ అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.


More Telugu News