Bill Gates: బిల్ గేట్స్ ను ఏఐ సదస్సుకు ఆహ్వానించడంపై వెనక్కి తగ్గిన కేంద్రం!

Bill Gates Name Removed from India AI Summit Speaker List
  • ఇటీవల విడుదలైన ఎప్ స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు
  • ఎప్ స్టీన్ బాధితులకు మద్దతుగా ప్రభుత్వ నిర్ణయం
  • సదస్సులో ప్రసంగించే ముఖ్య వక్తల జాబితాలో గేట్స్ పేరు తొలగింపు
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్' నుండి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తప్పుకున్నారు. లైంగిక వేధింపుల నేరగాడు జెఫ్రీ ఎప్ స్టీన్ తో బిల్ గేట్స్ స్నేహం, ఇటీవల విడుదలైన ఎప్ స్టీన్ ఫైల్స్‌లో గేట్స్ పేరు వెలుగులోకి రావడంతో భారత ప్రభుత్వం ఆయన ఆహ్వానాన్ని పునఃసమీక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. "బాధితులకు అండగా నిలవడమే తమ ప్రాధాన్యత" అని ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

వక్తల జాబితా నుంచి పేరు తొలగింపు
సోమవారం వరకు సమ్మిట్ ప్రధాన వక్తల జాబితాలో ఉన్న బిల్ గేట్స్ పేరు మంగళవారం ఉదయానికి మాయమైంది. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బిల్ గేట్స్ భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుని ఏఐ సదస్సుకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఎప్ స్టీన్ ఫైల్స్ వివాదం నేపథ్యంలో ఆయన పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి.

సదస్సు కొనసాగింపు
బిల్ గేట్స్ దూరమైనప్పటికీ, సదస్సు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ వంటి ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో ఏఐ పాత్రపై ఈ సదస్సులో చర్చలు జరుగుతున్నాయి.
Bill Gates
India AI Impact Summit
Jeffrey Epstein
Microsoft
Sundar Pichai
Sam Altman
Artificial Intelligence
AI Summit India
Chandrababu Naidu
Andhra Pradesh

More Telugu News