Zomato: బిర్యానీయే టాప్... జొమాటో 2024 నివేదిక విడుదల

Biryani tops the orders list of Zomata in 2024
షార్ట్స్‌లో చూడండి
మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరానికి ముగింపు కార్డు పడనుంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో 2024 సంవత్సర ముగింపు నివేదిక విడుదల చేసింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 

జనాలు ఈ ఏడాది అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ లో బిర్యానీదే నెంబర్ వన్ ప్లేస్ అని జొమాటో వెల్లడించింది. 2024లో 9,13,99,110 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. ఆ తర్వాత స్థానంలో 5,84,46,908 పిజ్జా ఆర్డర్లు వచ్చాయట. 

ఇక, రైల్వే టికెటింగ్ పోర్టల్ ఐఆర్ సీటీసీతోనూ జొమాటోకు భాగస్వామ్యం ఉంది. జొమాటో నిర్దేశిత రైల్వే స్టేషన్ల నుంచి, రైలు ప్రయాణికులకు వారు కోరుకున్న ఆహారాన్ని సరఫరా చేస్తుంటుంది. ఓసారి ఓ వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ 120 మంచూరియా కాంబోలు ఆర్డర్ చేశాడని జొమాటో తన నివేదికలో వెల్లడించింది. అయితే అవన్నీ అతడి ఒక్కడి కోసమే కాదట... ఆ కంపార్ట్ మెంట్ లో ఉన్న అందరి కోసం ఆర్డర్ చేశాడని వివరించింది. 

ఇక, తన నివేదికలో మరికొన్ని ఆసక్తికర అంశాలను కూడా జొమాటో పంచుకుంది. ఢిల్లీకి చెందిన ఓ ఆహార ప్రియుడు ఈ ఏడాది 1,377 రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తెప్పించుకున్నాడని వెల్లడించింది. 

2024లో... 17 మిలియన్ ప్యాక్ ల మ్యాగీ నూడిల్స్, 10 మిలియన్ క్యాన్ల కోకాకోలా ఆర్డర్లు బుక్ అయ్యాయట. ఒక వ్యక్తి 1,203 స్ప్రైట్ బాటిల్స్ ఆర్డర్ చేసినట్టు జొమాటో తెలిపింది.
Go Back to Shorts
Zomato
Biryani
Orders
Year End Report
2024
India

More Telugu News