ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి నియామకం
గుంటూరు జిల్లా తెనాలి మండలం జాగర్లమూడికి చెందిన మధుమూర్తి విశాఖపట్నంలో విద్యనభ్యసించారు. ప్రస్తుతం హనుమకొండలో ఉంటున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే అప్పటి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. వైస్ ఛైర్మన్ రామమోహన్‌రావు ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.