సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రూ. 2.10 కోట్లు అక్రమంగా చెల్లించారు: జీవీ రెడ్డి
- ఏపీ ఫైబర్ నెట్ దివాళా అంచున ఉందన్న జీవీ రెడ్డి
- 'వ్యూహం' సినిమాను ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసి రూ. 2.10 కోట్లు ఇచ్చారని ఆరోపణ
- అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని వెల్లడి
ఫైబర్ నెట్ సంస్థలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లను వేధింపులకు గురి చేసిందని మండిపడ్డారు. అప్పటి ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జీవీ రెడ్డి తెలిపారు. వైసీపీ నేతల అక్రమాలు బయటపడకుండా కీలక పత్రాలను మార్చేశారని మండిపడ్డారు. కీలక దస్త్రాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఓ మహిళా ఉద్యోగి చేరవేశారని చెప్పారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించామని వెల్లడించారు.