తన వివాహానికి రావాలంటూ ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన పీవీ సింధు

PV Sindhu invites CM Chandrababu for her wedding
  • పెళ్లి చేసుకోబోతున్న పీవీ సింధు
  • వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో జీవితం పంచుకోబోతున్న బ్యాడ్మింటన్ స్టార్
  • ఈ ఈ నెల 22న రాజస్థాన్ లో వివాహం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ నెల 22న రాజస్థాన్ లో ఆమె వివాహం జరగనుంది. వరుడు వెంకటదత్త సాయి ఓ వ్యాపారవేత్త. ఈ నేపథ్యంలో, సింధు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖులకు పెళ్లి కార్డులు పంచుతోంది. 

ఈ క్రమంలో, నేటి సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసింది. సింధు, ఆమె తండ్రి వెంకటరమణ ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చారు. తన పెళ్లికి రావాలంటూ సింధు వెడ్డింగ్ కార్డు అందించింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు విషెస్ తెలియజేశారు. సింధు ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు కూడా పెళ్లి కార్డులు అందించడం తెలిసిందే.
Go Back to Shorts
PV Sindhu
Wedding
Venkata Dattasai
Chandrababu
AP CM
Andhra Pradesh
Badminton

More Telugu News