నా కొడుకును చిత్రవధ చేశారు.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ తల్లి

12-12-2024 Thu 10:22 | National
Advertisement
  • బెంగళూరులో ఈ నెల 9న ఉరివేసుకున్న టెకీ అతుల్ సుభాష్
  • భార్య, ఆమె కుటుంబ సభ్యుల చేతిలో అనుభవించిన టార్చర్‌ను తమకు చెప్పకుండా దాచిపెట్టాడంటూ తల్లి కన్నీటి పర్యంతం
  • భార్య పెట్టిన కేసుల కారణంగా కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతున్నదీ రాసుకొచ్చిన టెకీ
  • అతుల్ భార్య, ఆమె కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కింద కేసు
Advertisement
తన కుమారుడిని చిత్రహింసలకు గురిచేశారని, అతడి ఆత్మహత్యకు అదే కారణమని బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్న టెకీ అతుల్ సుభాష్ తల్లి పేర్కొన్నారు. భర్తతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె.. భార్య, ఆమె కుటుంబ సభ్యుల చేతిలో తన కుమారుడు చిత్రవధ అనుభవించాడని, అయితే, అవేమీ తమకు తెలియకుండా దాచాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 34 ఏళ్ల అతుల్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న ఉరివేసుకున్నాడు. అంతకుముందు 1.5 గంటల వీడియో చిత్రీకరించడంతోపాటు, 24 పేజీల సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. అందులో తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను ఎలా వేధిస్తున్నదీ వివరించాడు. భార్య నిఖిత, ఆమె కుటుంబ సభ్యులు తనను ఎలా వేధిస్తున్నదీ అందులో పూసగుచ్చినట్టు రాసుకొచ్చాడు. అదనపు కట్నం, అసహజ శృంగారం, హత్యాయత్నం అంటూ తనపై తప్పుడు కేసులు ఎలా పెట్టిందీ వివరించాడు. ఈ కేసుల కారణంగా ఏడాది కాలంగా ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ ఫ్యామిలీ కోర్టు చుట్టూ ఎలా తిరుగుతున్నదీ చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

సుభాష్ ఆత్మహత్య నేపథ్యంలో అతడి భార్య, ఆమె కుటుంబంపై పోలీసులు బీఎన్ఎస్‌లోని సెక్షన్లు 108, 3(5) కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను 108 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు. అయితే, సుభాష్ ఆరోపణలను ఆయన అత్త కొట్టిపడేశారు. అతడు తన ఫ్రస్ట్రేషన్‌ను తమపై చూపించాడని, అవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొన్నారు.  
Advertisement
Atul SubhashBengaluruUttar PradeshCrime News

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more