తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు
- పర్యాటక శాఖకు ఈ మెయిల్ ద్వారా బెదిరింపు
- బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించిన పోలీసులు
- గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్
తాజ్ మహల్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని ఆగ్రా డీసీపీ సూరజ్ రాయ్ వెల్లడించారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదన్నారు. కాగా, బెదిరింపు మెయిల్ రాగానే పర్యాటకులను బయటకు పంపించి తనిఖీ చేశారు.