తాజ్‌మహల్‌‍కు బాంబు బెదిరింపు

భారత ప్రముఖ పర్యాటక ప్రదేశం, 17వ శతాబ్దపు స్మారక చిహ్నం తాజ్ మహల్‌కు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. పర్యాటక శాఖకు ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. తాజ్ మహల్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ మహల్ వద్దకు బాంబ్ డిస్పోజల్ టీమ్‌లను, డాగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహించారు.

తాజ్ మహల్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని ఆగ్రా డీసీపీ సూరజ్ రాయ్ వెల్లడించారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదన్నారు. కాగా, బెదిరింపు మెయిల్ రాగానే పర్యాటకులను బయటకు పంపించి తనిఖీ చేశారు.

Taj Mahal
Bomb Threat
Uttar Pradesh

More Telugu News