భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్
- బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు
- బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా భారత టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయంటూ పిటిషన్
- రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందన్న పిటిషనర్
బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా భారత టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ఈ దుష్ప్రచారం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఈ పిటిషన్ పై బంగ్లాదేశ్ హైకోర్టు వచ్చే వారం విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది.