'కన్నప్ప' సినిమాలో మంచు విష్ణు కుమార్తెలు.. ఫొటోలు షేర్ చేసిన విష్ణు
- నేడు అరియానా, వివియానాల పుట్టినరోజు
- బర్త్ డే సందర్భంగా వారి ఫొటోలను షేర్ చేసిన విష్ణు
- ఎంతో సంతోషంగా ఉందన్న విష్ణు, మోహన్ బాబు
''కన్నప్ప' సినిమాలో అరియానా, వివియానాల ఫొటోలను షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నా చిన్ని తల్లులు స్క్రీన్ పై చేసిన మ్యాజిక్ ను అందరూ ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నా. హ్యాపీ బర్త్ డే అరి, వివి' అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.
మరోవైపు ఎక్స్ వేదికగా మోహన్ బాబు స్పందిస్తూ... తన మనవరాళ్లు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. నటనపై వాళ్లకున్న అభిరుచి తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఇండస్ట్రీలో వారికి గుర్తింపు రావాలని, ఎంతోమందిలో వారు స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు.
