జర్నలిస్ట్ విజయ్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం... రూ.50 వేల జరిమానా

28-11-2024 Thu 17:07 | Andhra
Advertisement
  • సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ పిల్
  • రాజకీయ దురుద్దేశంతో పిల్ వేశారని ఏపీ హైకోర్టు సీరియస్
  • ఖరీదైన ఫోన్లు వాడే వారి తరఫున పిల్ వేయడమేమిటని ప్రశ్న
  • ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశం విస్మరించారని ఆగ్రహం
Advertisement
జర్నలిస్ట్ విజయ్ బాబుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రూ.50 వేల జరిమానాను విధించింది. వైసీపీ హయాంలో ఆయన అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సీరియస్ అయింది.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ పిటిషన్ వేశారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ రూ.50 వేల జరిమానాను విధించింది. నెల రోజుల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలో రూ.50 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని దివ్యాంగుల సంరక్షణ కోసం వినియోగించాలని తెలిపింది. 

ఈ పిటిషన్ ద్వారా ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను విస్మరించారని వ్యాఖ్యానించింది. అసలు తమ హక్కులు తెలియకుండా సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెడతారని ప్రశ్నించింది. సోషల్ మీడియా పోస్టులు పెట్టేవారు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు వాడుతున్నారని పేర్కొంది. ఇలాంటి వారి తరఫున పిల్ వేయాల్సిన అవసరమేమిటని ప్రశ్నించింది.

సమాజంలో తమ బాధను చెప్పుకోలేని వారి కోసం వేయాల్సిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ దురుద్దేశంతో వేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారని హైకోర్టు వెల్లడించింది. సోషల్ మీడియాను ఇష్టానుసారం వినియోగించుకుంటే న్యాయపరంగా అది నేరమేనని స్పష్టం చేసింది. కిరాయి మూకలుగా పని చేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిని శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పింది.
Advertisement
Andhra PradeshAP High CourtYSRCPTelugudesam

More Telugu News

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29
..more