Uttar Pradesh: జైలు ముందే డ్యాన్స్‌.. చూస్తూ ఉండిపోయిన పోలీసులు.. వీడియో వైర‌ల్!

Released From Jail Prisoner Breaks Into A Dance In UP Video goes Viral
షార్ట్స్‌లో చూడండి
జైలు జీవితాన్ని ఎవ‌రు కోరుకుంటారు చెప్పండి? జైలుకెళ్లిన వారు ఎప్పుడెప్పుడు బ‌య‌టికి వెళ‌దామా అని ఆశ‌గా చూస్తుంటారు. బ‌య‌టికి వ‌చ్చాక వారి ఆనందానికి హ‌ద్దులే ఉండ‌వు. అందుకే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జైలు నుంచి విడుద‌లైన ఓ వ్య‌క్తి వెరైటీగా సెల‌బ్రేట్ చేసుకున్నాడు. 

ఓ నేరంలో జైలుకి వెళ్లిన వ్య‌క్తి శిక్ష త‌ర్వాత బుధ‌వారం క‌న్నౌజ్ జైలు నుంచి విడుద‌ల‌య్యాడు. అలా కారాగారం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆ వ్య‌క్తి  జైలు ముందే పోలీసులు, జైలు సిబ్బంది చూస్తుండ‌గానే డ్యాన్స్ చేశాడు. అత‌డి ఆనందాన్ని అడ్డుకోలేక పోలీసులూ చూస్తూ ఉండిపోయారు. ఆ ఖైదీ తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.  
Go Back to Shorts
Uttar Pradesh
Jail
Prisoner
Zumba Dance

More Telugu News