వర్మ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ చేసే అవకాశం!
- చంద్రబాబు, పవన్, లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను పోస్ట్ చేసిన కేసు
- విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న వర్మ
- అరెస్ట్ చేసేందుకు సిద్ధమయిన పోలీసులు
చంద్రబాబు, పవన్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. ఈరోజు కూడా రెండోసారి విచారణకు డుమ్మా కొట్టడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వర్మ ఇంటికి ఇద్దరు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లు చేరుకున్నారు.