నేను ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తా: సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Chandrababu confident about fifth time CM
  • విజన్ డాక్యుమెంట్-2047పై చంద్రబాబు ప్రసంగం
  • మంచి పనులు చేస్తే ప్రజలు గెలిపిస్తారని వెల్లడి
  • తాను పదోసారి కూడా ఎమ్మెల్యేను అవుతానని ధీమా
ఏపీ అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్-2047పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఐదోసారి కూడా ముఖ్యంమంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. మంచి పనులు చేస్తే ప్రజలు గెలిపిస్తారని, మళ్లీ మనమందరం గెలిచి విజన్ 5.0ను కూడా తీసుకువద్దామని చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. 

గుజరాత్ లో గత 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉందని, అక్కడ బీజేపీనే గెలుస్తోందని తెలిపారు. హర్యానాలోనూ బీజేపీ మూడో పర్యాయం విజయం సాధించిందని అన్నారు. 

మన ప్రవర్తన వల్ల, మన పనుల వల్ల చైతన్యవంతులను చేయగలిగితే...  వారు ఎప్పుడూ మన వెంటే ఉంటారు అని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు నేను తొమ్మిదోసారి ఎమ్మెల్యేగా ఉన్నానని, పదోసారి కూడా ఎమ్మెల్యే అవుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
Advertisement
Chandrababu
Chief Minister
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News