73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా
- భారత్ లైనప్ ను కూల్చిన స్టార్క్, హేజిల్ వుడ్, మిచెల్ మార్ష్
- 5 పరుగులకే ఔట్ అయిన కోహ్లీ
- ప్రస్తుత స్కోరు 45 ఓవర్లలో 121 పరుగులు
మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్, మిచెల్ మార్ష్ లు భారత్ లైనప్ ను కుప్పకూల్చారు. వీరి బౌలింగ్ ధాటికి జైశ్వాల్ (0), కేఎల్ రాహుల్ (26), దేవదత్ (0), కోహ్లీ (5), జురేల్ (11), వాషింగ్టన్ సుందర్ (4) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. రిషభ్ పంత్ 37 పరుగులతో, నితీశ్ రెడ్డి 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు.