విజయసాయిరెడ్డిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్... విచారణ వాయిదా
- విజయసాయిపై ఐసీఏఐ నోటీసులు
- నోటీసులను రద్దు చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్
- డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన ఐసీఏఐ
ఈ నోటీసులను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను ఐసీఏఐ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. వృత్తిపరమైన ప్రవర్తన నియమావళిని విజయసాయి ఉల్లంఘించారని, ఆయనపై విచారణకు అనుమతినివ్వాలని ఐసీఏఐ కోరింది. కేసు పూర్వపరాలను పరిశీలించకుండానే నోటీసులను రద్దు చేయడం సరి కాదని తెలిపింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.