మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ షాక్... మెడికల్ సీట్ల అక్రమాలపై నోటీసులు
- పీజీ మెడికల్ సీట్లను అక్రమంగా విక్రయించారనే అభియోగాలు
- విచారణకు హాజరు కావాలని మల్లారెడ్డి కాలేజీకి నోటీసులు
- విచారణకు హాజరైన కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
తెలంగాణలో పలు మెడికల్ కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను విక్రయించారంటూ గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫిర్యాదులు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. అందులో భాగంగా గత ఏడాది జూన్లో మల్లారెడ్డి నివాసం, మెడికల్ కాలేజీలు, కార్యాలయాలలో ఈడీ సోదాలు నిర్వహించింది.
ఇతర మెడికల్ కాలేజీల్లోనూ ఈడీ సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా కీలక దస్త్రాలను, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. తెలంగాణలోని 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 45 సీట్లను బ్లాక్ చేసి విక్రయించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.