అన్నయ్య లేడంటే వదిన నమ్మలేదు: గాయని ఎస్పీ శైలజ
Add ap7am to your home Screen

అన్నయ్య లేడంటే వదిన నమ్మలేదు: గాయని ఎస్పీ శైలజ

SP Sailaja Interview
  • అన్నయ్య 51 రోజులు ఇబ్బంది పడ్డారన్న శైలజ 
  • వదినకి కొవిడ్ వచ్చినా కోలుకున్నారని వివరణ  
  • బాలు కోసం ప్రపంచమంతా ప్రార్ధించిందని వ్యాఖ్య 
  • చివరి క్షణం వరకూ పాట గురించే ఆలోచించారన్న శైలజ   
   

గాయనిగా ఎస్పీ శైలజ ఎన్నో సినిమాలకి పాడారు. పాటల నేపథ్యంలో సాగే ఎన్నో కార్యక్రమాలకు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ వచ్చారు. 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బాలూ గురించి ప్రస్తావించారు. "కరోనా అనేది ఒకటి వస్తుందనీ .. అది మాకు అన్నయ్యను దూరం చేస్తుందని మేము ఎంతమాత్రం ఊహించలేదు. అది మా కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది" అని అన్నారు. 

"అన్నయ్య 51 రోజుల పాటు ఇబ్బందిపడ్డారు. ఒక్కోరోజు ఆయన ఆరోగ్యం గురించి ఒక్కోటి చెప్పేవారు. తాను కోలుకున్న తరువాత మళ్లీ పాడగలుగుతానా? అని అన్నయ్య అక్కడివారిని అడుగుతూ ఉండేవారట. ఆ సమయంలో కూడా ఆయన పాట గురించే ఆలోచించారు. ఆయన కోలుకోవాలని ప్రపంచమంతా ప్రార్ధించింది. కానీ ఆయన పాడలేని పరిస్థితి అనేది రాకుండా, అలా పాడుతూ వెళ్లిపోవడమే ఒక రకంగా మంచిదేమో అనిపిస్తుంది" అని అన్నారు. 

"నిజానికి మా అన్నయ్యతో పాటు మా వదినకి కూడా 'కరోనా' వచ్చింది. ఆయన బెడ్ కి దగ్గరలోనే ఆమె బెడ్ ఉండేది. కానీ అక్కడ ఏం జరుగుతున్నది ఆమెకి తెలియదు. చరణ్ ను మాత్రమే అనుమతించేవారు. ఆ తరువాత వదిన కోలుకున్నారు .. కానీ అన్నయ్య విషయంలో అలా జరగలేదు. అన్నయ్య ఇక లేరని అంటే వదిన నమ్మలేదు .. ఆయన లేస్తాడని అనేవారు. మా అందరికంటే ఎక్కువగా ఆమె ఎఫెక్ట్ అయ్యారు. చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆరోగ్యపరంగా చాలా దెబ్బతిన్నారు" అని చెప్పారు. 

Advertisement
Sailaja
SP Balu
Charan

More Telugu News