బరువు పెరగాలంటూ అభిమాని సూచన.. సమంత జవాబు ఇదే..!
- 2024 లో ఉన్నామని గుర్తుచేసిన హీరోయిన్
- ఇతరులపై తీర్పులు చెప్పడం మానేయాలని హితవు
- తన ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహారం తీసుకుంటున్నట్లు వెల్లడి
తన బరువు గురించి మరో కామెంట్ అంటూ సమంత నిట్టూర్చారు. ‘నేను మయోసైటిస్ తో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలుసో లేదో కానీ వైద్యుల సూచనల ప్రకారం డైట్ మెయింటైన్ చేస్తున్నా. దీనివల్ల బరువు పెరగడం సాధ్యం కాదు. బరువు విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నా. దయచేసి ఇతరులలో తప్పొప్పులు చూడడం ఇప్పటికైనా మానేయండి. మనం 2024లో ఉన్నామనే విషయం గుర్తించండి. లివ్ అండ్ లెట్ లివ్..’ అంటూ సమంత జవాబిచ్చారు.