Pushpa 2: 'పుష్ప‌-2'లో యంగ్ బ్యూటీ ఐటెమ్ సాంగ్‌.. నెట్టింట ట్వీట్ వైర‌ల్‌!

Pushpa 2 Makers Welcoming the Exceptionally Talented Dancer Sreeleela on Board
షార్ట్స్‌లో చూడండి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'పుష్ప‌-2'. బ‌న్నీకి ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన 'పుష్ప‌'కు ఇది సీక్వెల్‌. ఈ సినిమా డిసెంబ‌ర్ 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి విడుద‌లైన పాట‌లు, గ్లింప్స్‌, పోస్ట‌ర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. 

ఈ క్ర‌మంలో ఇప్పుడు ఈ చిత్రంలోని ఐటెమ్ సాంగ్‌కు సంబంధించి ఓ ట్వీట్ వైర‌ల్‌ అవుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సాంగ్ చేయ‌బోతున్నట్లు అందులో ఉంది. "టాలెంటెడ్ డ్యాన్స‌ర్ శ్రీలీల‌కి స్వాగతం.. ఇద్ద‌రు ప‌వ‌ర్‌ఫుల్ డ్యాన్స‌ర్లు వేదిక‌పై నిప్పులు చెరిగేందుకు సిద్ధంగా ఉన్నారు" అంటూ ట్వీట్ చేశారు. 

అలాగే ఈ పాట చిత్రీక‌ర‌ణ ఈ నెల 6 నుంచి మొద‌లుకానుంద‌ని తెలిపారు. ప్ర‌ముఖ నృత్య‌ద‌ర్శ‌కుడు గ‌ణేశ్ ఆచార్య కొరియోగ్ర‌ఫీ అందించ‌నున్నారు. దీనికి రేసుగుర్రంలోని సినిమా చూపిస్తా మావ అనే పాట‌పై శ్రీలీలను బ‌న్నీ ఎత్తుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను జోడించారు. 

అస‌లు త‌గ్గేదేలే అంటూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇది చూసిన సినిమా ల‌వ‌ర్స్ ఇద్ద‌రు టాలెంటెడ్ డ్యాన్స‌ర్ల‌ను ఒకేసారి తెర‌పై చూస్తే థియేట‌ర్లు ద‌ద్ధ‌రిల్లిపోవ‌డం ఖాయ‌మ‌ని కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇది నిజం కావాల‌ని కూడా కోరుకుంటున్నారు.   
Go Back to Shorts
Pushpa 2
Allu Arjun
Sreeleela
Sukumar
Tollywood

More Telugu News