Chandrababu: రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

CM Chandrababu will launch free gas cylinders scheme from Srikakulam district
షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల వేళ టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా ఒకటి. ఈ పథకం అమలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు (నవంబరు 1) సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. 

చంద్రబాబు శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో పర్యటించనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభ ద్వారా ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడనున్నారు. అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.

కాగా, ఉచిత గ్యాస్ కోసం రాష్ట్రంలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అర్హులైన వారికి ఉచిత గ్యాస్ ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. 

ఇప్పుడు దీపం-2 పథకంలో భాగంగా ఉచిత సిలిండర్లను అందించనున్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పేదలపై గ్యాస్ భారం తగ్గుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు ఒకటి చొప్పున పంపిణీ చేయనున్నారు.
Go Back to Shorts
Chandrababu
Free Gas Cylinders
Srikakulam District
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News