ఏపీ మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన

21-10-2024 Mon 19:31 | Andhra
Advertisement
  • ఏపీలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
  • ఆ దిశగా కీలక అడుగులు
  • ప్రత్యేక చొరవ చూపిస్తున్న మంత్రి నారా లోకేశ్
  • నేడు ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ
Advertisement
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించేందుకు స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ ప్ర‌ణాళిక‌లు, దేశంలోనే మొద‌టిసారిగా జ‌రుగుతున్న స్కిల్ సెన్స‌స్‌కి స‌హ‌కారం అందించాల‌ని ఏపీ ఐటీ, విద్య శాఖ‌ల మంత్రి నారా లోకేశ్  కేంద్ర మంత్రి జ‌యంత్ చౌధురిని కోరారు. 

ఢిల్లీలోని కౌశల్ భవన్‌లో స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ శాఖ కేంద్ర‌మంత్రి జ‌యంత్ చౌధురి, సెక్ర‌ట‌రీ అతుల్ కుమార్ తివారీ, నేష‌న‌ల్ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ సీఈవో వేద్ మ‌ణి తివారీల‌తో ఏపీ మంత్రి నారా లోకేశ్, ఉన్న‌తాధికారులు భేటీ అయ్యారు. 

ఈ సంద‌ర్భంగా ఏపీలో చేప‌ట్ట‌నున్న స్కిల్ సెన్సస్‌పై మంత్రి లోకేశ్ స్పెష‌ల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. స్కిల్ సెన్స‌స్ ల‌క్ష్యం ఏమిటి? ఎలా చేప‌డుతున్నార‌ని కేంద్ర‌మంత్రి ఆరా తీశారు. స్కిల్ సెన్స‌స్ పైలెట్ ప్రాజెక్టు పూర్తి కాగానే గుర్తించిన లోటుపాట్లు స‌రిచేసి రాష్ట్ర వ్యాప్తంగా చేప‌డ‌తామ‌ని లోకేశ్ వివ‌రించారు. 

కూట‌మి ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో ల‌క్ష‌లాది ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్, స్కిల్ సెన్సస్ చేప‌ట్టింద‌ని తెలిపారు. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ ల‌క్ష్యం చేరుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం, నేష‌న‌ల్ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్‌, మంత్రిత్వ‌శాఖ‌ల నుంచి ఏపీకి ఏమేం కావాలో వివ‌రిస్తూ ఓ లేఖ‌ను మంత్రి నారా లోకేశ్ అంద‌జేశారు.

లోకేశ్ విజ్ఞప్తి పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్రమంత్రులు హామీ ఇచ్చారు. ఢిల్లీ కౌశ‌ల్ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ స‌మావేశంలో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, విద్య శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ తోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పాఠ‌శాల విద్యాశాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్‌, డైరెక్ట‌ర్ విజ‌య‌రామ‌రాజు, ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ ఎండీ, సీఈవో గ‌ణేశ్ కుమార్‌, ఈడీ దినేశ్ కుమార్ పాల్గొన్నారు.

మంత్రి లోకేశ్ కోరిన సంస్థ‌లు, స‌హ‌కారం వివరాలు...

  • ప‌బ్లిక్- ప్రైవేటు పార్ట‌న‌ర్ షిప్ మోడ‌ల్‌లో ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ అమ‌రావ‌తిలో నెల‌కొల్పాలి.
  • వార‌ణాసి, హైద‌రాబాద్ ల‌లో విజ‌య‌వంతంగా న‌డుస్తున్న మాదిరిగానే స్కిల్ ఇండియా ఇంట‌ర్నేష‌న్ సెంట‌ర్ ఇన్ అమ‌రావ‌తి కావాలి
  • గ‌తంలోనే విశాఖ‌ప‌ట్నంలో ఏడు ఎక‌రాలు కేటాయింపు జ‌రిగిన చోట నేష‌న‌ల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలి
  •  మంగ‌ళ‌గిరిలో జెమ్స్ అండ్ జ్యూయ‌ల‌రీ , అమ‌రావ‌తిలో నిర్మాణ‌రంగం, క‌ర్నూలులో రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ, చేనేత‌-హ‌స్త‌క‌ళ‌లు, విశాఖ‌లో ఫార్మా లాబ్స్‌, నెల్లూరు, తిరుప‌తిలో ఎల‌క్ట్రానిక్ సిస్ట‌మ్ డిజైన్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ సెంట‌ర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు నెల‌కొల్పేందుకు స్కిల్ కౌన్సిల్ స‌హ‌కారం అందించాలి.
  • పీఎంకేవీవై (ప్ర‌ధాన మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న‌) కేటాయింపులు జ‌ర‌గాలి.
  • నేష‌న‌ల్ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ వెబ్ సైట్లతో ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ అనుసంధానం చేయాలి.
  • గిరిజనుల నైపుణ్య‌ శిక్ష‌ణ కేంద్రాలు నెల‌కొల్పేందుకు పెద్ద ఎత్తున‌ నిధులు కేటాయించాలి
Advertisement
Nara LokeshMinisterSkill DevelopmentSkill CensusTDP-JanaSena-BJP AllianceAndhra Pradesh

More Telugu News

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29
..more