గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి మెసేజ్ పంపిన సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి

somy alis direct message to lawrence bishnoi for zoom call
  • మీతో మాట్లాడాలని అనుకుంటున్నా అంటూ బిష్ణోయ్ కి మెసేజ్ పెట్టిన సోమీ అలీ
  • జూమ్ కాల్ మాట్లాడేందుకు మొబైల్ నెంబర్ ఇవ్వాలని విజ్ఞప్తి 
  • సోమీ అలీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులకు పాల్పడటంతో పాటు ఇటీవల సల్మాన్ సన్నిహితుడు, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో ఈ గ్యాంగ్ పేరు మరో మారు చర్చనీయాంశం అయింది. ఈ తరుణంలో ఆ గ్యాంగ్ స్టర్ పేరును ప్రస్తావిస్తూ సల్మాన్ మాజీ ప్రియురాలు సోమీ అలీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టడం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం సోమీ అలీ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
 
'నమస్తే లారెన్స్ బిష్ణోయ్. జైలు నుండి కూడా మీరు జూమ్ కాల్స్ చేస్తారని నాకు తెలిసింది. నేను మీతో కొన్ని విషయాలు చర్చించేందుకు మీతో మాట్లాడాలని అనుకుంటున్నా. మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? ఈ ప్రపంచంలో రాజస్థాన్ నాకు ఇష్టమైన ప్రదేశం. తొలుత మీతో జూమ్ కాల్‌లో మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నా. నన్ను నమ్మండి.. ఇదంతా మీ మంచి కోసమే. మీ మొబైల్ నంబర్ ఇస్తే.. సంతోషిస్తా' అంటూ సోమీ అలీ పేర్కొన్నారు. అలాగే బిష్ణోయ్ ఫోటోను ఆమె షేర్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ జైల్ లో ఉన్న సంగతి తెలిసిందే.  

పాకిస్థానీ అమెరికన్ నటి అయిన సోమీ అలీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. గతంలో సల్మాన్ తో ఓ చిత్రంలో నటించిన సమయంలో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమయిందో కానీ వీళ్లిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సల్మాన్‌పై సోమీ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. 'సల్మాన్ అమ్మాయిలను కొట్టేవాడు. ఆయనను అభిమానించడం మానండి. అతను ఒక శాడిస్ట్. మానసిక రోగి' అంటూ తీవ్ర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అయితే ఆ పోస్టు వైరల్ కావడంతో తర్వాత దాన్ని తొలగించారు.  
Advertisement
somy ali
lawrence bishnoi
zoom call
Salman Khan
Social Media

More Telugu News