ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సమావేశం... హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
Add ap7am to your home Screen

ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సమావేశం... హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu and Pawan Kalyan attends NDA meet chaired by PM Modi
  • ఛండీగఢ్ లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం
  • పలు కీలక అంశాలపై చర్చ
  • చంద్రబాబు, పవన్ లో ఉల్లాసంగా మాట్లాడిన మోదీ 
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఛండీగఢ్ లో నేడు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. 

కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. 

ఈ సమావేశం సందర్భంగా చంద్రబాబు, పవన్ లతో ప్రధాని మోదీ ఎంతో ఉల్లాసంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
Advertisement
NDA Meeting
Narendra Modi
Chandrababu
Pawan Kalyan
TDP-JanaSena-BJP Alliance

More Telugu News