దేవర చిత్రానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం వుంటుంది: ఎన్టీఆర్
- దేవర విజయం పట్ల సంతోషంలో ఎన్టీఆర్
- థాంక్యూ నోట్‌ను విడుదల చేసిన దేవర
- విజయానికి కారణమైన అందరికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్
ఇక ఈ చిత్రం సాధించిన విజయంతో ఆనందంలో ఉన్న ఎన్టీఆర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక థాంక్యూ నోట్‌ను విడుదల చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఖాతాలో ఈ నోట్‌ను పోస్ట్ చేశారు. దేవర పార్ట్ 1 విజయానికి కారణమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్రేక్షకులకు, సినీ పరిశ్రమ మిత్రులకు, ఆయన అభిమానులకు ఈ థాంక్యూ నోట్‌లో కృతజ్క్షతలు తెలియజేశారు.
