ఆస‌క్తిక‌రంగా వ‌రుణ్ తేజ్ 'మ‌ట్కా' టీజ‌ర్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస‌క్తిక‌రంగా వ‌రుణ్ తేజ్ 'మ‌ట్కా' టీజ‌ర్‌

Varun Tej New Movie Matka Teaser Out Now
  • వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబోలో 'మ‌ట్కా'
  • పీరియాడిక్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న మూవీ
  • నవంబర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ కరుణ కుమార్ కాంబోలో వ‌స్తున్న‌ మూవీ ‘మట్కా’. ఈ సినిమాను 1958 నుంచి 1982 మ‌ధ్య‌ జరిగే కథతో పీరియాడిక్ జానర్ నేపథ్యంలో తెర‌కెక్కిస్తున్న‌ట్లు చిత్రం యూనిట్ చెబుతోంది. దాంతో, ఈ మూవీ స్టోరీ ఏమై ఉంటుందా...? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ‘మట్కా’ అనే ఆస‌క్తిక‌ర‌ టైటిల్‌తో మేకర్స్ మ‌రింత హైప్ తీసుకొచ్చారు.

ఇక ఈ సినిమా నుండి తాజాగా టీజర్ విడుద‌లైంది. ఈ టీజర్‌ను ఆద్యంతం ఎంగేజింగ్‌గా క‌ట్ చేశారు మేక‌ర్స్‌. విశాఖ‌ప‌ట్నం న‌గ‌రం నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీ ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ గెటప్స్‌లో వేరియేషన్స్ ప్రేక్షకులను, అభిమానులకు స‌రికొత్త అనుభూతిని క‌ల్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వ‌రుణ్‌ మొత్తం నాలుగు విభిన్న‌మైన అవ‌తారాల్లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

ఇక సినిమాలో హీరో చెప్పే డైలాగులు కూడా బాగున్నాయి."వైజాగ్ అంటే... ఒక‌టి స‌ముద్రం గుర్తుకురావాలి లేదా ఈ వాసు గుర్తుకురావాలి", "మ‌న‌కు ఏది అవ‌స‌ర‌మో అదే ధ‌ర్మం" వంటి డైలాగ్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. 

ఈ మూవీలో మెగా ప్రిన్స్ స‌ర‌స‌న‌ అందాల భామలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి న‌టిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వ‌స్తున్న ఈ సినిమాకు త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ జీవీ ప్రకాశ్ కుమార్ బాణీలు అందిస్తున్నాడు. నవంబర్ 14న 'మట్కా' చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Advertisement
Matka Teaser
Varun Tej
Tollywood
Karuna Kumar

More Telugu News