ప్రారంభమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
హర్యానాలో బీజేపీ పదేళ్లుగా పాతుకుపోయింది. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుండగా, ఈసారి కాషాయ పార్టీకి విజయం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండడంతో సహజంగా ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, కుల సమీకరణాలు ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మరో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.