మంత్రి కొండా సురేఖ యూట‌ర్న్‌.. త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

Konda Surekha Take Back her Comments on Samantha
  • నాగ చైత‌న్య‌-స‌మంత విడాకులకు కేటీఆరే కార‌ణ‌మ‌న్న కొండా సురేఖ‌
  • రాజకీయ, సినీ వర్గాలలో దుమారం రేపిన మంత్రి వ్యాఖ్య‌లు
  • త‌న వ్యాఖ్య‌ల ఉద్దేశం స‌మంత మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డం కాద‌న్న మంత్రి
నాగ చైత‌న్య‌-స‌మంత విడాకుల విష‌య‌మై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ దుమారం రేపిన‌ విష‌యం తెలిసిందే. దీంతో మంత్రి వ్యాఖ్య‌ల‌ను అంద‌రూ ముక్త‌కంఠంతో ఖండించారు. దాంతో తాజాగా కొండా సురేఖ స్పందించారు. త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు తెలిపారు. 

త‌న వ్యాఖ్య‌ల ఉద్దేశం మ‌హిళ‌ల ప‌ట్ల ఒక నాయ‌కుడి చిన్న‌చూపు ధోర‌ణిని ప్ర‌శ్నించ‌డం మాత్ర‌మేన‌ని అన్నారు. కానీ స‌మంత మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డం కాద‌ని స్ప‌ష్టం చేశారు. స్వ‌యం శ‌క్తితో ఆమె ఎదిగిన తీరు త‌న‌కు ఆద‌ర్శం అని సురేఖ అన్నారు. త‌న వ్యాఖ్య‌ల వ‌ల్ల స‌మంత కానీ, ఆమె ఫ్యాన్స్ కానీ మ‌న‌స్తాపానికి గుర‌యిన‌ట్లైతే బేష‌ర‌తుగా ఆ వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు మంత్రి తెలిపారు.
Advertisement
Konda Surekha
Samantha
Naga Chaitanya

More Telugu News