'దేవ‌ర' మొద‌టిరోజు వ‌సూళ్లు ఎంతంటే..!
Add ap7am to your home Screen

'దేవ‌ర' మొద‌టిరోజు వ‌సూళ్లు ఎంతంటే..!

Divara Movie First Day Collections
  • ఎన్‌టీఆర్‌, కొరటాల శివ కాంబోలో 'దేవర' 
  • దేశ‌వ్యాప్తంగా తొలిరోజు రూ.77కోట్ల క‌లెక్ష‌న్స్‌
  • వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 140కోట్లు కొల్ల‌గొట్టిన మూవీ
యంగ్‌టైగ‌ర్‌ ఎన్‌టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన దేవ‌ర పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఆరేళ్లకు తార‌క్ సినిమా రావ‌డంతో అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆ అంచ‌నాల‌ను అందుకుంటూ దేవ‌ర తొలిరోజు భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. 

దేశ‌వ్యాప్తంగా రూ.77కోట్లు వ‌సూలు చేసిన దేవ‌ర వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 140కోట్లు కొల్ల‌గొట్టింది. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచే రూ. 68కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. 

ఈ మూవీలో తార‌క్ స‌ర‌స‌న తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే మ‌రో బాలీవుడ్ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించారు. ప్రకాశ్ రాజ్‌, శ్రీకాంత్‌, మురళీ శర్మ, మలయాళ న‌టుడు షైన్ టామ్ ఛాకో త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ బాణీలు అందించారు.
Advertisement
Divara
First Day Collections
Tollywood
Jr NTR

More Telugu News