జనసేనలో చేరిన బాలినేని, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య... కండువా కప్పిన పవన్ కల్యాణ్
- ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి
- నేడు పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిక
- సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య కూడా జనసేనలోకి ఎంట్రీ
- పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్న పవన్
ఇక, వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య కూడా బాలినేనితో పాటు ఇవాళ జనసేన పార్టీలో చేరారు. ఉదయభాను, కిలారి రోశయ్యలకు జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పవన్ వారికి సూచించారు.