Monkeypox Virus: కేరళ యువకుడికి ప్రమాదకర క్లేడ్‌- 1బీ రకం మంకీపాక్స్‌.. దేశంలో ఇదే తొలికేసు

India reports first mpox case of clade 1b from Kerala
షార్ట్స్‌లో చూడండి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇటీవల కేరళలోని మలప్పురం తిరిగొచ్చిన వ్యక్తిలో ప్రమాదకర మంకీపాక్స్ వైరస్‌లోని క్లేడ్1బీ రకాన్ని గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ రకం స్టెయిన్‌ను సంబంధించి దేశంలో నమోదైన తొలి కేసు ఇదేనని వైద్యులు తెలిపారు.  

38 ఏళ్ల బాధితుడిలో వారం రోజుల క్రితమే వైరస్‌ను నిర్ధారించారు. తాజాగా అతడికి సోకింది క్లేడ్-1బీ రకమని తేలింది. కాగా, ఈ నెల 9న విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తిలో క్లేడ్-2 రకం వైరస్‌ను గుర్తించారు. ఇది పశ్చిమాఫ్రికాలో వ్యాప్తిలో ఉంది.
Go Back to Shorts
Monkeypox Virus
Clade-1b
Kerala
Malappuram
UAE

More Telugu News