దేవర మరో వేడుకకు సన్నాహాలు?

Preparations for another celebration of Devara
  • ఫంక్షన్‌ రద్దు కావడంతో నిరాశలో అభిమానులు 
  • అభిమానుల కోసం మరో వేడుక?
  • అధికారిక సమాచారం కోసం వెయిటింగ్‌
ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన చిత్రం 'దేవర'. ఆర్ఆర్‌ఆర్‌ తరువాత ఎన్టీఆర్‌ నటించిన ఏ చిత్రం విడుదల కాకపోవడంతో.. దేవర చిత్రంపై ఎన్నో అంచనాలతో ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. అయితే నిన్న జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్‌ వేడుక రద్దు అయిన సంగతి తెలిసిందే. 

రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ఎన్టీఆర్‌ అభిమానులు అసంఖ్యాకంగా తరలిరావడంతో ఫంక్షన్‌ జరగాల్సిన వేదిక దగ్గర గందరగోళం నెలకొంది. పరిస్థితి చేయి దాటడంతో ఇక చేసేది ఏమీలేక ఫంక్షన్‌ను రద్దు చేశారు. ఫంక్షన్‌ వేదిక అభిమానుల సంఖ్యకు తగ్గట్టుగా లేకపోవడం, ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌ లెక్కకు మించిన పాస్‌లను జారీ చేయడమే ఇందుకు కారణంగా తెలిసింది. ఫంక్షన్‌ రద్దు కావడంతో ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతో నిరాశగా గమ్య స్థానాలకు వెళ్లిపోయారు. చాలా రోజుల తరువాత అభిమానులను కలుసుకునే అవకాశం మిస్‌ అవ్వడంతో ఎన్టీఆర్‌తో పాటు దేవర టీమ్‌ కూడా బాధలో వున్నారు. 

అయితే త్వరలోనే అభిమానులతో మరో వేడుకకు దేవర టీమ్‌ సన్నాహాలు చేస్తోందని సమాచారం. అయితే దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి వుంది. సినిమా విడుదల లోపు అంటే ఈ నెల 27 లోపు కుదిరితే ఓ వేడుక వుంటుందని, లేదంటే సినిమా విడుదల తరువాత థాంక్స్‌ మీట్‌ను ఫ్యాన్స్‌ కోసం గ్రాండ్ గా చేస్తారని తెలిసింది. అయితే దీనిపై అధికారిక సమాచారం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
Advertisement
Devara
Devara review
Ntr latest news
Devara pre release
Devara latest update

More Telugu News