వరద బాధితుల సహాయార్థం చంద్రబాబుకు చెక్కులు అందించిన ప్రముఖులు

  • వరదల కారణంగా విజయవాడ అతలాకుతలం
  • సీఎం రిలీఫ్ ఫండ్‌కు పలువురు ఆర్థిక సాయం అందజేత
  • హైదరాబాద్‌లో చంద్రబాబుకు చెక్కులు అందించిన ప్రముఖులు
భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. వరద బాధితుల సహాయార్థం ఎంతోమంది ముఖ్యమంత్రి సహాయనిధికి ఆర్థిక సాయన్ని అందిస్తున్నారు. ఆదివారం చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ సమయంలో ఏపీ సీఎంను కలిసిన పలువురు ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెక్కులను అందించారు. వారికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు. విరాళాలు అందించిన వారు వీరే...

జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డి రూ.5 కోట్ల విరాళం 


కాంటినెంటల్ కాఫీ తరపున చల్లా శ్రీశాంత్ రూ.1 కోటి 11 లక్షల విరాళం 

   
చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరపున చల్లా అజిత రూ.1 కోటి విరాళం 


కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్ అరుణ్ అలగప్ప, ఎండీ శంకర్ సుబ్రహ్మణ్యం రూ.1 కోటి 50 లక్షల విరాళం  

ట్రైజియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వేములపల్లి అశోక్, రోహిత్ వేములపల్లి రూ.1 కోటి విరాళం 
 

లారస్ ల్యాబ్స్ ఫౌండర్ & సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా, నాగరాణి చావా రూ.1 కోటి విరాళం 
 

 చలసాని చాముండేశ్వరి, శ్రీమన్ రూ.25 లక్షల విరాళం 
 

అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రూ.2 లక్షల విరాళం


నరసింహారావు రూ.2 లక్షల విరాళం
 

Vijayawada
Floods
Chandrababu

More Telugu News