జియో నుంచి 'ప్రైమా' సిరీస్‌లో సరికొత్త ఫీచర్ ఫోన్

11-09-2024 Wed 07:00 | Technology
Advertisement
  • జియో ప్రైమా 2 పేరుతో కొత్త మొబైల్‌ను  
  • జియో ప్రైమా మొబైల్‌కు కొనసాగింపు 
  • యూపీఐ పేమెంట్స్ చేసుకునే సదుపాయం కూడా  
Advertisement
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తాజాగా కొత్త ఫోన్‌‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. గత ఏడాది లాంచ్ చేసిన జియో ప్రైమా మొబైల్‌కు కొనసాగింపుగా జియో ప్రైమా 2 పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. పాత ఫోన్‌కు మరిన్ని మెరుగైన ఫీచర్లను జోడించింది. తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసిన జియో ప్రైమా 2 మొబైల్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి..? దీని ధర ఎంత..? తదితర పూర్తి వివరాలు ఒకసారి పరిశీలిస్తే...
 
జియో ఫ్రైమా 2 ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ధరను రూ.2,799గా నిర్ణయించారు. బ్లూ కలర్‌లో ఈ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చిన్న ఫీచర్ ఫోన్‌లో ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. జియో ప్రైమా 2 మొబైల్ లో 2.4 అంగుళాలతో కూడిన కర్వడ్ స్క్రీన్ ను అందించారు. కీ ప్యాడ్‌తో పని చేసే ఈ మొబైల్‌‌లో క్వాల్ కామ్ చిప్ సెట్ ప్రొసెసర్‌ను అందించారు. ఫోన్ లో 2000 ఎంఏహెచ్ వంటి పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. 
 
ఈ మొబైల్ సింగిల్ న్యానో సిమ్‌ను సపోర్టు చేస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ వంటి యాడ్స్‌కు ఈ మొబైల్ సపోర్టు చేస్తుంది. వాట్సాప్, ఫేస్ బుక్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. 4జీ కనెక్టివిటీకి సపోర్టు చేసే ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను ఇచ్చారు. ఈ మొబైల్‌లో యూపీఐ పేమెంట్స్ చేసుకునే సదుపాయం ఏర్పాటు చేయడం మరో విశేషంగా పేర్కొంటున్నారు. ఈ మొబైల్ 23 భాషలకు సపోర్టు చేస్తుంది.
Advertisement
JioJiophone prima 2Reliance Jio

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more