బుడమేరుకు పెరుగుతున్న వరద.. విజయవాడ వీధుల్లోకి నీళ్లు
- గురువారం తెల్లవారుజామున భారీ వర్షం
- బెజవాడకు మరోసారి వరద ముప్పు
- ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్న జనం
అయితే తాజాగా కురిసిన వర్షానికి నగరంలోని పలు కాలనీల్లోకి మరోమారు వరద వచ్చి చేరుతోంది. మరోవైపు, బుడమేరు వాగుకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు. గత నాలుగు రోజుల పాటు తిండి, నీరు లేక అవస్థ పడిన జనం.. మరోసారి ఆ కష్టాలను ఎదుర్కోలేమని ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు.