వైసీపీలో జగన్ ను కంట్రోల్ చేసే సూపర్ పవర్ ఎవరో ఉన్నారు: డొక్కా మాణిక్య వరప్రసాద్

  • ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన డొక్కా
  • వైసీపీలో రోజుకో టెస్ట్ తో పిచ్చెక్కించారని వెల్లడి
  • వైసీపీలో జగన్ చెప్పినట్టు చేయాల్సిందేనని వ్యాఖ్యలు
ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో జగన్ కంటే సూపర్ పవర్ ఇంకెవరో ఉన్నారని వెల్లడించారు. జగన్ ను కంట్రోల్ చేసే పవర్ మరేదో ఉందని అన్నారు. 

వైసీపీలో రోజుకో టెస్ట్ తో పిచ్చెక్కించారని వ్యాఖ్యానించారు. తనకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, రోజుకో మాట చెప్పి ఫుట్ బాల్ ఆడారని డొక్కా వివరించారు. వైసీపీ పైనా, జగన్ పైనా తనకు ఎటువంటి కక్ష లేదని స్పష్టం చేశారు. 

వైసీపీలో జగన్ చెప్పినట్టు చేయాల్సిందేనని... పదవులు, టికెట్లు రావాలంటే తిట్టాల్సిందేనని స్పష్టం చేశారు. నాతో కూడా దుర్మార్గంగా మాట్లాడించారని డొక్కా వాపోయారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే గతంలో వైసీపీలో చేరానని, కానీ వైసీపీ ఇచ్చిన టెస్టుల్లో ఫెయిలయ్యానని వెల్లడించారు. 

ఇటీవలి పరిణామాలు చూస్తుంటే, త్వరలో వైసీపీ ఖాళీ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అభిప్రాయపడ్డారు. జగన్ కు ఓటు బ్యాంకు ఉందని, అమాయక ఎస్సీ, ఎస్టీలను మందుపెట్టి దోచుకున్నారని విమర్శించారు.

Dokka Manikya Varaprasad
Jagan
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News